English   

అఖిల్ సాహసం మొదలయ్యింది 

 Akhil
2019-05-24 13:12:44

ఎట్టకేలకు అఖిల్ నాలుగవ సినిమా పట్టాలేక్కింది. ఇప్పటి దాకా అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ హిట్ మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ మాత్రం రాలేదు. అలాంటిది ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కులు అంతా దాదాపుగా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న సినిమా ఈరోజే లాంచ్ అయ్యింది.  అక్కినేని అమల, నాగార్జున, అల్లుఅరవింద్ ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్స్ కోసం చిత్ర యూనిట్ పలు పేర్లను పరిశీలిస్తోంది. కైరా అద్వానీ, రష్మిక పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ రష్మికను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఒంగోలు గిత్త సినిమా తరవాత కనిపించకుండా పోయినా భాస్కర్ ని నమ్మి అఖిల్ సినిమా చేయడం అంటే సాహసమే మరి ఏమవుతుందో ?  

More Related Stories