English   

సీత మూవీ రివ్యూ 

 Sita
2019-05-24 14:07:12

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన మూవీ సీత. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీని తేజ తెరకెక్కించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్లు, చిత్ర ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.   నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తేజ సీతతో ప్రేక్షకుల అంచనాలు అందుకున్నారా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కధ :

తన ఎదుగుదల కోసం కోసం దేనికైనా తెగించే గర్వం కలిగిన అమ్మాయి సీత(కాజల్), అందగత్తె అయిన సీత ని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు లోకల్ ఎమ్మెల్యే బసవ ( సోనూ సూద్ ) . అయితే బసవ ప్రేమని నిరాకరింహిన సీత కాకపోతే కొద్దిరోజులు డేటింగ్ చేద్దామని  5 కోట్ల రూపాయలకు ఒక డీల్ ఒప్పుకుంటుంది. అయితే అలా డేటింగ్ చేయడానికి ఒప్పుకున్న సీతకు ఈ ఒప్పందం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఈ తరుణంలో సీత అమాయకుడైన రఘురామ్(బెల్లంకొండ శ్రీనివాస్)ను ట్రాప్ చేసి తన లక్ష్యం సాధించుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే తన ఎదుగుదల కోసం సీత చేసిన ఈ ప్లాన్ నెరవేరిందా ? సీత బసవ నుంచి తప్పించుకుందా ? అసలే అమాయకుడు అయిన రఘు రామ్ సీతను కాపాడాడా సమస్యల నుండి బయటపడేశాడా.? అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ :

సీత పాత్రలో కాజల్ అగర్వాల్ అద్భుతంగా నటించింది. సీత పాత్రకు కాజల్ పూర్తి న్యాయం చేసింది. ప్రతీ సన్నివేశంలోనూ తన సహజ నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమాయక చక్రవర్తి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌కు బెల్లంకొండ నటన జీవం పోసింది. కమెడియన్ బిత్తిరి సత్తి కొంతవరకు నవ్వించగలిగాడు. సోనూ సూద్ కు కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది. మన్నారా చోప్రా గ్లామర్ తో అలరించింది. ఇక స్పెషల్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ కుర్రాళ్లకు ఏసీలో కూడా సెగలు పుట్టించింది. విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు విషయానికి వస్తే మంచి కథ ని ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా అది మ్యాజిక్ చేయలేకపోయింది. సీత పాత్రపై పెట్టిన దృష్టి కథనం మీద చూపించి ఉంటే సినిమా మరింత బాగా వచ్చేది.మొదటి హాఫ్ అంతా కొన్ని ఎమోషనల్, కొన్ని కామెడీ సీన్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉంది. అటు సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.

ఇక ఫైనల్ గా : కాజల్ వన్ వుమెన్ షో ఈ సీత.  

రేటింగ్ : 2.5 / 5

More Related Stories