జగన్ కి మహేష్ విషెస్

2019-05-24 16:59:19
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ, కేంద్రంలో మోడీ ఘన విజయం సాధించడం పట్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ‘ఏపీలో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ గారికి శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం సరికొత్త ఎదుగుదలకి నోచుకోవాలని, మీ పదవీకాలం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. అలాగే కేంద్రంలో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మహేశ్ అభినందనలు తెలిపారు. మోదీ పాలనలో భారత్ సుస్థిరతవైపు పయనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి మహేష్ బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం తరపున గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయట పడ్డారు. మరి మహేష్ ఆయనకు అయితే ఇప్పటి దాకా శుభాకాంక్షలు తెలపలేదు మరి.