English   

బాబాయ్ ఓటమి అబ్బాయ్ స్పందన 

Ram Charan
2019-05-24 17:37:43

ఏపీలో 2019 ఎన్నికలు కొందరికి జీవితాంతం గుర్తుండి పోతాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకి చావుదెబ్బ తగిలిడమే కాక కనీసం పవన్ అయినా గెలుస్తాడు అనుకుంటే ఆయన రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. రాష్ట్రంలో ఒక్క సారిగా వచ్చిన వైసీపీ వేవ్‌ లో టీడీపీతో పాటు జనసేన పార్టీ కుదేలైపోయింది. వైసీపీ మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాలని కైవసం చేసుకుంటే టీడీపీ 23 స్థానాలకి పరిమితమైంది. పవన్ పార్టీ ఓకే సీటుకు పరిమితం అయ్యింది. జనసేన ఇంత ఘోరంగా ఓడిపోవడం పట్ల రామ్ చరణ్ స్పందించారు. “గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం” అంటూ తన ఫేస్‌బుక్ లో పోస్టు పెట్టారు. అలాగే ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి భేషరతుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

More Related Stories