English   

సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఓవర్...తాప్సీ హిట్ కొట్టేనా ? 

 Game over
2019-05-24 18:17:30

ఝుమ్మంది నాదం సినిమాతో తెరంగ్రేటం చేసిన తాప్సీకి తెలుగులో పెద్దగా హిట్లు లేవు. ఎంతో ప్రయత్నించిన మీదట ఆమె బాలీవుడ్ లో సెటిల్ అవ్వగలిగింది. అలా అక్కడ పింక్, మన్మర్జియాన్, బద్లా, మల్క్ వంటి సినిమాలతో, విభిన్న పాత్రలు చేస్తూ తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో గేమ్ ఓవర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. సినిమా చూసిన సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14న విడుదల కానుంది. నయనతార లీడ్ రోల్ నటించగా తమిళ నాట ఘనవిజయం సాధించిన మయూరి వంటి సినిమాని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’  చిత్రం రూపొందింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఓకే రోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అయినా తాప్సీ తెలుగులో హిట్ కొడుతుందేమో చూడాలి మరి.

More Related Stories