English   

పూజ ఛాన్స్ కోసం రానా ?

pooja hegde
2019-05-24 18:38:08

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న లీడింగ్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలు అన్నీ దెబ్బ వేయడంతో ఈమెకు ఐరెన్ లెగ్ అనే పేరు వచ్చేసింది. ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడి కెరీర్ గాడిలో పడి, క్రంపీ ఐరెన్ లెగ్ ముద్ర తొలగించుకుంది. ఇక ఈ మధ్య మహేష్‌ బాబుతో చేసిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి వెల్లువలా పడుతున్నాయి . ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు , ప్రభాస్ తో జాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ కొడితే పూజ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇదిలా ఉంటే హిందీలోను అమ్మడు అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, రానా తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బంద లాంటి వారితో కలిసి  పూజా హెగ్డే కూడా నటిస్తోంది. అయితే స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో పూజకి ఛాన్స్ రావడానికి కారణం రానా నే అనే ప్రచారం జరుగుతోంది. రానా రికమండేషన్ వలనే పూజాకు ఆ సినిమాలో అవకాశం వచ్చిందని ఆ ప్రచారం సారాంశం. ఇది నిజమో కాదో తెలియదు కానీ, పూజా మాత్రం భలే ఛాన్స్ కొట్టేసింది.

More Related Stories