English   

విక్రమ్ కి బాలా లీగల్ నోటీసులు

bala
2019-05-24 20:12:36

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకి తెలియనిది కాదు, ఆ క్రేజ్ తో ఈ సినిమాని పలు బాశాలలోకి తెరకెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలుత ఈ సినిమాని తమిళంలో 'వర్మ' అనే టైటిల్ తో రూపొందించారు. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ కుమారుడు 'ధృవ్' హీరోగా నటించాడు. అయితే దర్శకుడితో  ఏర్పడిన క్రియేటివ్ దిఫరేన్సేస్ కారణంగా ఆ సినిమా అవుట్ పుట్ మొత్తాన్ని నిర్మాతలు పక్కన పెట్టేశారు. అయితే కొడుకు సినిమాకి బూస్ట్ ఇచ్చేందుకు ఇందులో విక్రమ్ కూడా నటించాడని అప్పట్లో కోలీవుడ్లో వినిపించింది. అయితే మొత్తానికి ఇప్పుడు ధృవ్ తప్ప మిగతా తారాగణాన్ని మార్చేసి, తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకి పని చేసిన అసిస్టంట్ డైరెక్టర్ 'గిరీశయ్య' అనే ఆయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మళ్లీ రీ షూట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను 'ఆదిత్య వర్మ'గా కూడా మార్చారు. అయితే తాజాగా బాల విక్రమ్ కి లీగల్ నోటీసులు పంపించారు. తాను షూట్ చేసిన ఏ సన్నివేశాన్ని కూడా 'ఆదిత్య వర్మ' సినిమాలో వాడకూడదని ఆ నోటీసులలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మన మధ్య జరిగిన సంఘటనలను తను బహిరంగంగా మాట్లాడితే ధృవ్ భవిష్యత్తు మీద అది చెడు ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నాననీ ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలనుకుంటున్నానని సినిమాలో సన్నివేశాలు వాడితే మాత్రం జరగబోయే వాటికి తను బాద్యుడిని కాదని ఆయన లీగల్ నోటీసుల్లో పేర్కొన్న్నట్టు సమాచారం.

More Related Stories