English   

బాబుకు వర్మ బస్తీ మే సవాల్

ramgopalvarma
2019-05-24 20:55:58

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో అత్యంత చీకటి రోజులను నేపథ్యంగా చేసుకుని దర్శకుడు వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాని ఏపీలో ఎన్నికల వంకతో నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక చేసేది లేక ఎన్నికలు ముగిసిన తర్వాత రిలీజ్ ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసి విజయవాడలో సినిమా ప్రెస్‌మీట్ పెట్టడానికి ప్రయత్నాలు చేయగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో పాటు విజయవాడలోకి అడుగు పెట్టకుండా, ప్రెస్ మీట్ నిర్వహించకుండా విమానం ఎక్కి పంపించారు. పోలీసులు వర్మను అడ్డుకోవడం వెనక అప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఆదేశాలే కారణం అని వర్మ ఆరోపణలు చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం, బాబు ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో పాటు రామ్ గోపాల్ వర్మకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. దీంతో ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.  ‘‘విజయవాడలో ఆదివారం నేను నిర్వహించబోయే ప్రెస్‌మీట్ కోసం... ఎన్‌టి‌ఆర్ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానo..జై జగన్'' అంటూ వర్మ Twitter ఆహ్వానం పంపారు.

More Related Stories