English   

హీరో కానున్న సుడిగాలి సుధీర్ !

sudheer
2019-05-25 08:06:02

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలా మంది సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. అందులో ధనరాజ్, షకలక శంకర్ లాంటి వాళ్ళు అయితే హీరోలుగా కూడా మారి కొన్ని సినిమాలు చేశారు. అలా కాక ఈ బ్యాచ్ లో కొందరు కమెడియన్స్ గా కూడా బిజీ అయ్యారు. అలా అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తోన్న వారిలో సుడిగాలి సుధాకర్ ఒకరు. చిన్న చిన్న పాత్రల చేస్తున్న సుధీర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా రూపొందుతోంది. శేఖర్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా పులిచర్ల రాజశేఖర్ రెడ్డి అనే అయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోసాని కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ కనిపించనుంది. జూలై చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హీరోగా సుధీర్ ఎంతవరకూ రాణిస్తాడో చూడాలి మరి.

More Related Stories