English   

జబర్దస్త్ కి రోజా బై...నాగబాబు మాత్రం

roja
2019-05-25 08:30:00

ఈటీవీలో ప్రైం టైమ్లో వచ్చే 'జబర్దస్త్' కామెడీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ కామెడీ షోకి నాగబాబు - రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజకీయ సంబంధమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వలన ఈ ఇద్దరూ 'జబర్దస్త్' కార్యక్రమంలో కనపడలేదు. ఆ తరువాత రోజా వచ్చేసి మళ్లీ బిజీ అయ్యింది కానీ, నాగబాబు ఇంకా జాయిన్ కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడం వైసీపీ బంపర్ మెజారిటీతో గెలవడం జరిగిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అవుతోన్న నేపథ్యంలో రోజాకి ఆయన క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కొచ్చని అంటున్నారు. మంత్రి అయితే ఆమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదులుకునే అవకాశం వుంది. ఇక ఎంపీ అయినా తాను 'జబర్దస్త్' వదులుకోనని ఇంతకుముందే నాగబాబు చెప్పారు. అయితే నాగబాబు పది పదిహేను రోజులు ప్రజలు చుట్టూ తిరిగి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోవచ్చని ఏకంగా ఎంపీనే అయిపోదామనుకున్నాడు నాగబాబు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రజలు నాగబాబును అడ్డంగా ఓడించారు. ఆయన ఓడిపోవడంతో ఇక 'జబర్దస్త్' కి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.  

 

More Related Stories