English   

అసిస్టంట్ కొరియోగ్రాఫర్ పెళ్ళికి వెళ్లిన బన్నీ...అందుకేనట ?

alluarjun
2019-05-25 09:02:21

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న శిరీష్ అనే వ్యక్తి వివాహ వేడుక‌లో సంద‌డి చేశారు. నిజానికి సినిమాల‌పై ఆసక్తితో హైద‌రాబాద్‌కి వ‌చ్చిన శిరీష్ మొద‌ట్లో గీతా ఆర్ట్స్‌లో అసిస్టెంట్ బాయ్‌ గా చేరాడు. డ్యాన్స్‌పై అత‌నికి ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించిన బ‌న్నీ అతనికి శిక్ష‌ణ ఇప్పించార‌ట‌. అలా ఆయన ఈరోజు అసిస్టంట్ కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు, అలా ఆయ‌న వివాహానికి బన్నీ రాక‌తో ఆ వివాహ మండపం అంతా సంద‌డిగా మారింది. బ‌న్నీని చూసేందుకు ఆయ‌న అభిమానులు పెద్ద ఎత్త్తున ఈ వివాహానికి హాజరయ్యార. నూత‌న వ‌ధూ వ‌రులు బ‌న్నీ పాదాలకి న‌మ‌స్క‌రించగా బ‌న్నీ వారిని దీవించారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్నఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.  

 

More Related Stories