English   

సువర్ణసుందరి ఏమి చేస్తుందో ?

suvarna
2019-05-25 09:17:38

సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ, హాట్ బ్యూటీ సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా మూవీ సువర్ణసుందరి. సూపర్ నేచురల్ సబ్జెక్ట్ తో, అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమా మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా సువర్ణసుందరి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతే కాక ఈ సినిమాలో కంటెంట్ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట. ఈ సినిమా చేసిన సెన్సార్ సభ్యుల నుంచి సువర్ణ సుందరి చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయని సినిమా హిట్ కావడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలి హిట్ అయిన దాఖలాలు లేవు, కాస్త అలాంటి నేపధ్యంలోనే తెరకెక్కిన అఖిల్, సాక్ష్యం లాంటి సినిమాలు దెబ్బ కొట్టాయి, మరి ఈ సినిమా ఏమి చేస్తుందో మరి ?

 

More Related Stories