ఏపీ ఎన్నికలలో గెలిచిన సమంత...

అదేంటి ఏపీ ఎన్నికలు ఏంటి ? సమంత గెలవడం ఏమిటని అనుకుంటున్నారా ? అయితే మీకు జ్ఞాపకం ఉంది ఉండాడు కానీ ఆ మధ్య సమంతా టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం ఉన్నా సరే ఆమె మద్దతు తెలిపిన అభ్యర్థి ఎన్నికల్లో 13వేల మెజార్టీతో ఘన విజయాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సమంత సోషల్ మీడియాలో చేసిన ప్రచారమే ఆయన్ను గెలిపించింది ? నిజానికి రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్ధిగా అనగాని సత్య ప్రసాద్ పోటీచేశారు. ఆయన్ను గెలిపించమని కోరుతూ సైకిల్ గుర్తుకే మీ ఓటంటూ వీడియో పోస్ట్ చేశారు సమంత. సత్య ప్రసాద్‌కు మద్దతుగా నిలవడానికి కారణం ఆయన చాలా మంచి వాడని.. ఆయన సోదరి తన స్నేహితురాలని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చారు. అలా సమంత చేసిన ప్రచారం వలన రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచినా అది తట్టుకొని సమంత సపోర్ట్ చేసిన అనగాని సత్యప్రసాద్ గెలవడం విశేషం.