మంచి నటిని కాదని బాధ పడ్డాను...కానీ సూర్య కూడా ?

సాయి పల్లవి తాజాగా నటిస్తున్న సినిమా ఎన్జీకే. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె హీరో సూర్యకు భార్యగా నటించింది. ఇదే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మే 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది ఈ సినిమా యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర అంశాన్ని బయట పెట్టింది. ఓ సీన్లో తాను నటించిన విధానం దర్శకుడికి నచ్చలేదని దీంతో తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తన నటనతో సెల్వరాఘవన్ ఇంప్రెస్ అవ్వలేదనీ ఎంతకీ అది ఆయనకు నచ్చక పోవడంతో ఆ సీన్ షూట్‌ను తర్వాతి రోజుకు వాయిదా వేశారని దీన్తి తను ఇంటికి వెళ్లి అమ్మకు విషయం చెప్పాననీ తాను మళ్ళీ వైద్య వృత్తికి వెళ్లిపోతా, మంచి నటిని కాదనీ బాధపడ్డానని ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాక దేవుడి దయతో ఆ మరుసటి రోజు నా తొలి టేక్‌ను దర్శకుడు ఓకే చేశారని అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని సూర్యను అడిగితే తనకు కూడా సెల్వరాఘవన్ ఎప్పుడూ సింగిల్ టేక్‌కి ఓకే చెప్పలేదని సూర్య చెప్పారని దీంతో ఆయన కూడా చాలా టేక్ లు తీసుకుంటారని తెలిసిన తర్వాతే కాస్త కుదుటపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.