English   

అమరావతి నుండి గెలిచిన టాలీవుడ్ హీరోయిన్

Navneet Kaur
2019-05-25 13:53:39

ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గ నటించిన ఒక భామ, ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా ఎన్నికయి పార్లమెంట్ లో అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు శీను వాసంతి లక్ష్మి" చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన నవనీత్‌కౌర్‌. టాలీవుడ్ లో అప్పట్లో బాలయ్య లాంటి అగ్రహీరోలతో నటించిన ఈ భామకి  ఆశించినంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. ఇంతకీ ఆ రాణా ఎవరో కాదు  ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు మేనల్లుడు. 2011లో రవి రాణా, నవనీత్ కౌర్ జోడీ, 3100 ఇతర జంటలతో కలిసి సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటైంది. ఇక ఇప్పుడు నవనీత్ కౌర్ కూడా భర్త అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ఏకంగా ఎంపీ అయింది. లోక్ సభ ఎన్నికల్లో ఆమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 

More Related Stories