జబర్దస్త్ లో రోజా ప్లేస్ లో మీనా కాకుండా మరో సీనియర్ హీరోయిన్

తెలుగులో బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ టీఆర్పీలతో జబర్దస్త్ షో దూసుకుపోతోంది. ఈ సినిమా గత ఆరేళ్ళ నుండి ప్రసారం అవుతుండగా మొదలయిన నాటి నుండీ నాగబాబు, రోజాలే జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో జబర్దస్త్ షోకి కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో షో నిర్వహకులు శేఖర్ మాస్టర్, నటి మీనాలను తీసుకొచ్చారు. అయితే గత రెండువారాలుగా మళ్ళీ రోజా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నాగబాబు మాత్రం ఇంకా జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వలేదు కానీ కొత్తగా మాజీ సెలబ్రిటీ ఒకరు జబర్దస్త్ జడ్జ్ అవతారం ఎత్తారు. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ సంఘవి. తాజాగా సంఘవి రోజాతో కలిసి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు. మీనా స్థానంలో సంఘవిని తీసుకొచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రోజాకి మంత్ర్హి పదవి వస్తే ఆమె ఆ షో నుండి తప్పుకున్తుందట అందుకే ఆమె ప్లేస్ లో సంఘవిని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఇక ఎటూ నాగబాబు గెలవలేదు కాబట్టి ఆయన త్వరలోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.