English   

సాహోలో సల్మాన్ నటించడం లేదట ?

Sujeeth
2019-05-25 17:09:55

బాహుబలి సిరీస్  దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమా సాహో ఈ సినిమా మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న సాహోలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నారని రెండ్రోజుల నుండి ప్రచారం జరిగింది. ఇందులో సల్మాన్‌ ది అతిథి పాత్ర అయినా ఈ చిత్రానికే అది హైలైట్‌గా నిలిచే అవకాశం ఉందని గట్టిగా ప్రచారం జరిగింది. దీంతో ఇదే విషయం మీద ఈ విషయంపై దర్శకుడు సుజీత్ స్పందించాడు. ఈ సినిమా షూటింగును ఇప్పటికే పూర్తి చేసేశామని అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు అలాంటి అతిధి పాత్ర ఏది ఈ సినిమాలో లేదని కొద్ది రోజుల నుండి జరుగుతున్న ప్రచారానికి కొట్టి పారేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌, నీల్ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, చంకీ పాండే, మహేశ్‌ ముఖర్జీ, అర్జున్‌ విజయ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

More Related Stories