English   

రచ్చ రేపుతున్న శర్వా రణరంగం 

Sharwanand
2019-05-25 18:34:09

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్ళు టైటిల్ సమస్యలు ఎదుర్కొన్న ఆ సినిమా ఎట్టకేలకు రణరంగంగా రానుంది. వైజాగ్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ తో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, ఈ వీడియోలో మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా శర్వా లుక్ ఆకట్టుకుంటోంది. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకేక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక గ్యాంగ్‌స్టర్‌ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది.

More Related Stories