English   

ఓ బేబీ టీజర్ టాక్ 

 Oh Baby Teaser
2019-05-25 19:53:07

మ‌జిలీతో హిట్ అందుకున్న సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఎక్స్ పెరిమెంటల్ మూవీ ఓ బేబీ. ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఇక ఈ టీజర్ ని పరిశీలిస్తే ‘మాంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. నాని గాడిని పెంచి పెద్ద చేయడమే సరిపోయిందంటూ ’ నాగశౌర్యతో సమంత చెబుతున్న డైలాగ్, ‘నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా’ అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ మూవీ వస్తోంది. ఓ బేబీ టీజర్ లో సమంతతోపాటు, సీనియర్ నటి లక్ష్మీ కూడా కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌ను ఏర్పాటు చేసిన 55 ఏళ్లయిన సందర్భంగా నిర్మిస్తోన్న చిత్రం కావడంతో నిర్మాత సురేశ్ బాబు కూడా ఈ మూవీ విషయంలో స్పెషల్ కేర్ చూపిస్తున్నారు.

More Related Stories