English   

టెంపర్ తెలుగు టు తమిళ్...మళ్ళీ తమిళ్ టు తెలుగు 

vishal
2019-05-25 20:21:17

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. ఈ సినిమా ఫ్లాప్స్ వలన ఇబ్బందుల్లో ఉన్న ఈ ఇద్దరూ బయట పడి మళ్ళీ ట్రాక్ లో పడ్డారు. అయితే పూరీ మళ్ళీ ట్రాక్ తప్పినా ఎన్టీఆర్ మాత్రం వరస హిట్స్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ వలన ఈ సినిమాని తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో విశాల్‌ హీరోగా అయోగ్య పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపుగా తెలుగు సినిమాను మక్కీ కి మక్కీ దించేసినా క్లైమాక్స్‌ను మాత్రం పూర్తిగా మార్చేశారట. ఈ మధ్యనే అనేక వాయిదాల తర్వాత తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయోగ్య తమిళ్ లో కూడా ఘనవిజయం సాధించింది. దీంతో విశాల్ కి ఇక్కడ కూడా కాస్తో కూస్తో మార్కెట్ ఉండడంతో ఇప్పుడు అయోగ్యను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సినిమాను తిరిగి తెలుగులో డబ్‌ చేయడం అంటే కాస్త సాహసమే అయినా ఈ సినిమా క్లైమాక్స్ మార్చారని చెబుతున్నారు కాబట్టి ఈ సినిమా క్లైమాక్స్ కోసం అయినా ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. జూన్‌ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మల్కాపురం శివ శంకర్ ద్వారా తెలుస్తోంది.

More Related Stories