English   

ఇంత బిజీలో కూడా డైలాగ్ రైటర్ గా ?

vijaysethupati
2019-05-26 07:50:38

ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోలలో విజ‌య్ సేతుప‌తి ఒకరు. తెలుగులో సైరా చిత్రంతో పాటు వైష్ణ‌వ్ తేజ్ సినిమా చేస్తున్న విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో అయితే ఏకంగా తొమ్మిదికి పైగా ప్రాజెక్టులు చేస్తున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా విజ‌య్ డైలాగ్ రైట‌ర్‌గా మారాడ‌ని అంటున్నారు. గ‌తంలో ఆరెంజ్ మిట్టాయి అనే చిత్రానికి విజ‌య్ సేతుప‌తి డైలాగ్స్ అందించ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంతగా ఆడలేదు. అయిన‌ప్ప‌టికి మ‌రోసారి డైలాగ్స్ అందించేందుకు విజయ్ ముందుకొచ్చాడు. స్పేస్ అడ్వెంచ‌ర్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న చెన్నై ప‌ల‌ని మార్స్ అనే చిత్రానికి విజ‌య్ సేతుప‌తి డైలాగ్స్ అందిస్తున్నాడు. కొత్త న‌టీనటులు నటించనున్న ఈ సినిమాని  రూర‌ల్ బ్లాక్ కామెడీ సినిమాగా రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆరెంజ్ మిట్టై ద‌ర్శ‌కుడు బిజు విశ్వ‌నాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సారి విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ రాసి డైలాగ్ రైటర్‌గా కూడా విజ‌య్ త‌న స‌త్తా చాటుకోనున్నాడ‌ని త‌మిళ మీడియా టాక్‌.

More Related Stories