English   

రీల్ కపుల్ కానున్న రియల్ కపుల్

arya
2019-05-26 08:30:08

రెన్నెళ్ళ క్రితం వివాహ బంధంతో ఒక్క‌టైన తమిళ కొత్త జంట ఆర్య‌, సాయేషా సైగ‌ల్ మరోసారి కలిసి నటించబోతున్నారు. నిజానికి 2018లో వ‌చ్చిన గ‌జినీ కాంత్ సినిమాలో క‌లిసి న‌టించ‌గా, ఆ సినిమా షూట్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప్రేమ పెళ్ళికి దారి తీసింది. ప్ర‌స్తుతం వీరు కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న కాప్పాన్ సినిమాలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ ప్రధాన మంత్రి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు వీరు మరో సినిమాలో కలిసి నటించనున్నారు. శక్తి సౌందరరాజన్ ‘టెడ్డీ’ అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కథలో ఈ జంట ఫస్టాఫ్ లో ప్రేమికులుగా ఆ తరువాత ఒక్కటయిన భార్యాభర్తలుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

More Related Stories