English   

జగన్ సీఎం అయిన రెండో రోజే లక్ష్మీస్ ఎన్టీఆర్

lakshmisntr
2019-05-26 08:42:11

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో త‌ప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి హిట్ టాక్ సాధించింది. దివంగత ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చాక జరిగిన పరిణామాలను ల‌క్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఈ సినిమా తెర‌కెక్కింది. ఏపీలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని వ‌ర్మ కొంత కాలంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి ఎన్నికల కోడ్ దెబ్బకు ఈ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. ఇక ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ సినిమాను మే 31న విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మే 30న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, మే 31న సినిమాను అక్కడ విడుదల చేస్తామని వర్మ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరగనున్నాయని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఎక్కడయితే ఎక్స్ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ దగ్గర ఈ ఆదివారం 4 గంటలకు అంటే ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు వర్మ.

More Related Stories