English   

ఈరోజు మీటింగ్...అంతా వారి చేతుల్లోనే ఉంది

raghava
2019-05-26 08:58:34

కొరియోగ్రాఫ‌ర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత నటుడిగా మారి ఆ తర్వాత ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్న లారెన్స్ దర్శకకత్వంలో వచ్చిన కాంచన సిరీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఆయన కాంచన 3 సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావించాడు. ల‌క్ష్మీ బాంబ్ అనే పేరుతో అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొందుతుండగా, త‌న‌కి తెలియ‌కుండా సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌డంతో ఆవేద‌న చెందిన లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించి కలకలం రేపాడు. పేరు కంటే ఆత్మ‌గౌర‌వం అనేది మ‌నిషికి చాలా ముఖ్యమని, అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టమని అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నానని ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. అయితే త‌న అభిమానులు, అక్ష‌య్ అభిమానులు కాంచ‌న రీమేక్ నుండో తప్పుకోకుండా తానే చేయాల‌ని కోరుతున్నార‌ని, వారి ప్రేమ‌కి ధ‌న్యుడినని లారెన్స్ త‌న తాజా ట్వీట్‌లో తెలిపారు. కాంచ‌న రీమేక్ చిత్రం చేసేందుకు నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల‌య్యాననీ  ఎన్నాళ్ళ నుండో ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాననీ అందుకే ఈ రోజు చిత్ర నిర్మాత‌లు నన్ను క‌లిసేందుకు చెన్నై వ‌స్తున్నారనీ వారితో మీటింగ్ త‌ర్వాత‌ చిత్రాన్ని తెర‌కెక్కించాలా వ‌ద్దా అనేది ఫైనల్ చేస్తానని అంతా వారి చేతుల్లోనే ఉందని అంతా మంచే జ‌రుగుతుందని లారెన్స్ పేర్కొన్నారు. 

More Related Stories