English   

కూతుళ్ళను కూడా లైన్ లోకి తెచ్చేసిన రాజశేఖర్

raj
2019-05-26 09:43:29

రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల కూతుళ్ళు శివానీ, శివాత్మిక‌లు వెండితెర ఆరంగేట్రం చేయడానికి సిద్దమయిన సంగ‌తి తెలిసిందే. శివానీ 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌ లో అడ‌వి శేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, ఇక శివాత్మిక దొర‌సాని చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌నుంది. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ హీరోగా న‌టిస్తున్నాడు. అతి త్వ‌ర‌లో ఇద్దరు వెండితెర‌ మీద హీరోయిన్స్ గా అల‌రించ‌నున్నారు. ఇక రాజ‌శేఖ‌ర్ త‌న ఇద్దరు కూతుళ్ళని ట్విట్ట‌ర్ మాథ్య‌మంలోకి ఆహ్వానిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. రానున్న రోజుల‌లో ఈ ఇద్ద‌రు భామ‌లు త‌మ సినిమాలకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ని సోష‌ల్ మీడియా వేదికగా జోరుగా ప్ర‌చారం చేసుకోడానికి వీలుగా ఇద్దరినీ ట్విట్టర్ లోకి తీసుకోచ్చారన్న మాట‌. ఇక మ‌రో వైపు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. ఆ  ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 

More Related Stories