English   

నాలుగో సారి రజనితో బాలీవుడ్ విలన్ ఫైట్  

rajini
2019-05-26 10:45:35

అదేంటో బాలీవుడ్ రేంజ్ తగ్గిందో లేక సౌత్ రేంజ్ పెరిగిందో కానీ బాలీవుడ్ న‌టులు ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించ‌డానికి ఎక్కువ ఆస‌క్తిని చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ గ‌త మూడు సినిమాల్లో చిత్రాల్లో స్టార్ బాలీవుడ్ న‌టులే ర‌జ‌నీకాంత్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ `కాలా`లో నానా ప‌టేక‌ర్, 2.0లో అక్షయ్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తే ఈ ఏడాది విడుద‌లైన `పేట‌`లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ విల‌న్‌గా న‌టించాడు. నాలుగో సారి సునీల్‌ శెట్టి, ర‌జ‌నీకాంత్‌తో ఢీ కొట్ట‌బోతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ద‌ర్బార్‌ సినిమా ఇప్ప‌టికే ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మ‌రో షెడ్యూల్‌ను 29 నుండి ప్రారంభించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.  15 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ కోసం సునీల్‌ శెట్టి విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయన తార కథానాయిక. ఈ సినిమాలో ఓ కార్పొరేట్‌ కంపెనీ వ్యవస్థాపకుడిగా కనిపించబోతున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.  

More Related Stories