English   

ఈసారి పెద్దగా ప్లాన్ చేస్తున్న బన్నీ 

alluarjun
2019-05-26 11:03:18

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని బ్యానర్, గీతా ఆర్ట్ కలిసి నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ను ప్రారంభించి రెండు ఫైట్లు తీసి సమ్మర్ హాలిడేస్ లాంటి గ్యాప్ ఇచ్చారు. స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉండడంతో ఈ గ్యాప్ వచ్చిందని అంటున్నా నిజానికి ఎండల దెబ్బకే గ్యాప్ ఇచ్చారని టాక్. అయితే ఈనెల ఆఖరికి ఎండలు తగ్గుముఖం పట్టనుండడంతో 29 నుంచి ఓ లాంగ్ షెడ్యూల్‌ ప్లాన్ చేస్తున్నారట. ఏకంగా ఏఎస్ అరి లాంగ్ షెడ్యూల్ ని దాదాపు 30 రోజుల పాటు హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 29న ప్రారంభించి వచ్చే నెల 26 వరకు జరిగే షెడ్యూల్‌లో సింహభాగం సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో దాదాపు కీలక నటులంతా పాల్గొంటారట. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లోకేషన్ల ఎంపికను ఇప్పటికే పూర్తి చేఇసింది యూనిట్. బన్నీ కూడా నాన్ స్టాప్‌గా సినిమా షూటింగ్‌ను చకచకా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇంత పెద్ద షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్న బన్నీ త్వరలోనే రిటర్న్ కానున్నారు.

More Related Stories