English   

విమర్శల పాలవుతున్న సమంతా 

samantha
2019-05-26 17:56:49

తెలుగులోనే కాన సౌత్ సినిమాలన్నిటిలో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న సమంత రెండేళ్ళ క్రితం అక్కినేని కోడలు అనే ట్యాగ్ తెచ్చుకుంది. ఈ ఏడాది తన భర్తతో కలిసి మజిలీ సినిమాతో హిట్ కొట్టిన సమంతా ప్రస్తుతం ఓ బేబీ అనే ప్రయోగాత్మక సినిమా చేస్త్జోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు కొత్త డ్రస్ లతో పిక్స్ దిగి పెడుతూ ఉంటుంది. తాజాగా సమంత వేసుకున్న డ్రస్ వల్ల అనేక విమర్శలు వస్తున్నాయి. స్పెషల్ గౌన్ ధరించిన శామ్ స్టైల్ గా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. ఆ ఫొటో కాస్త సోషల్ మీడియాలో విమర్శలకి దారి తీస్తోంది. ఈ డ్రెస్ లో నువ్వు అస్తి పంజరంలా ఉన్నావని కొందరు ఇప్పటి వరకు నువ్వు వేసుకున్న డ్రస్ లలో అతి చెత్త డ్రస్ ఇదే అంటూ మరి కొందరు.. డైటింగ్ తగ్గించి కాస్త తిను అంటూ మరి కొందరు చిత్ర విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రస్ లో సమంత మరీ బక్కగా కనిపించడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.  

More Related Stories