English   

వర్మ నెక్స్ట్... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు...మరో రచ్చ ?

rgv
2019-05-26 20:16:46

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లోప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన విషయం తెలిసిందే. అదే ప్లేస్ లో ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన వర్మ విజయవాడలోనే మరో చోట ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈనేప్దహ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కీలక వ్యక్తి ఫోన్ కాల్ తో అప్పుడు తనను బలవంతంగా వెనక్కి పంపించేశారని, ఆ వ్యక్తి ఎవరనేది త్వరలో బయటకు వస్తుందని అన్నారు. ఈ సినిమాతో నిజం చెప్పేందుకు ప్రయత్నించానని, అది కొంతమందికి నచ్చలేదని, అందుకే, ఈ సినిమా విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించారని అన్నారు.

ఈ నెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను విడుదల చేస్తామని, ఈ చిత్రం రాజకీయ అంశంతో కూడుకున్నది కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి ఏదో ఊహించుకుని కాంట్రావర్శీ చేసింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. ఏపీలో టీడీపీ ఓటమిపై వర్మ ప్రస్తావిస్తూ తనకూ ఫ్లాప్స్ ఉన్నాయని అందుకే దీని మీద ఏమీ మాట్లాడానని అన్నారు. అంతేకాక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ లో వర్మ మరో ఆసక్తికర ప్రకటన చేశారు. తన తర్వాతి సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ప్రకటించారు. విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందని అన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో లా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారని చెబుతూ తనకు ఈ సుమోలు చూశాక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డే నిర్మాతగా ఉంటారని పేర్కొన్నారు.

More Related Stories