English   

ఇస్మార్ట్ శంకర్ లైన్ ఇదే...పూరీ గట్టిగానే ప్లాన్ చేశాడు ?

 Ram Ismart Shankar
2019-05-27 11:25:36

రామ్ – పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ఈ సినిమా టీజ‌ర్ మొన్ననే విడుద‌లైంది. పూరి సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో రామ్ కూడా అచ్చంగా అలానే ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాలోని రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో రామ్ ఓ లోకల్ రౌడీ అని అతను ఒకపని ఒప్పుకుని సుపారీ తీసుకున్నాడంటే ఎంతకైనా తెగిస్తాడట. అయితే అనుకోకుండా ఒకానొక సమయంలో శంక‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రినే చంపడానికి సుపారీ తీసుకుంటాడు. సీఎం ని చంపే క్రమంలో రామ్ కు కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అలాగే ఈ సినిమాలో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ బాగా పేలింద‌ని తెలుస్తోంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుందని ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని చాన్నాళ్ళగా ఫెయిల్ అవుతూ వచ్చిన పూరీ ఈ సినిమా విషయంలో చాలా జగ్రత్తలు తీసుకుని తన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే పోకిరి సినిమాని మించి ఉంటుందని అంటున్న్నారు. చూడాలి ఈ సినిమాతో అయినా వీరు హిట్ కొడతారో లేదో ?

More Related Stories