English   

ఇండియన్ హిస్టరీలోనే మొదటిసారి...

 Kasada Thapara
2019-05-27 11:37:20

నిజానికి సినిమా అంటేనే ఒక ప్రయోగం, అలాంటిది సినిమాలతో ప్రయోగాలు చేయడంలో ఆరితేరి పోయారు మన వాళ్ళు. ఏదైనా ఒక సినిమాను తీసుకుంటే ఆ సినిమాకు దర్శకుడు సంగీత దర్శకుడు, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ ఇలా వివిధ విభాగాలకు ఒక్కొక్క టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. ఇక చాలా అరుదైన సందర్భాల్లో ఒక్కో సినిమాకి ఇద్దరేసి టెక్నీషియన్స్ ఉంటారు. కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు దర్శకత్వం చేయడం కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీతాన్ని అందించడం ఇప్పటివరకు కొన్ని సందర్భాల్లో జరిగింది. కానీ ఒకే సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులు - ఆరుగురు సినిమాటోగ్రాఫర్ లు - ఆరుగురు ఎడిటర్ లు వర్క్ చేయడం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే జరగలేదు. కానీ అది మొదటి సారి ఒక తమిళ సినిమాకు జరుగబోతుంది. శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా  'కసాడ తబార'. ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. అదేంటంటే ఈ సినిమాలో ఆరు భాగాల కథతో ఉంటుందట. ఆరు పోర్షన్ లకు ఆరుగురు దర్శకులు స్క్రీన్ ప్లే అందించారు. సినిమా ఆరు పోర్షన్ లకు గాను ఆరుగురు సంగీత దర్శకులు వేరు వేరుగా, సినిమాటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వర్క్ చేయబోతున్నారు. అది కూడా టాప్ టెక్నీషియన్స్ విజయ్ తో పులి అనే సినిమాని  తెరకెక్కించి దెబ్బ తిన్న శంకర్ శిష్యుడు బుదేవన్ ఈ చిత్రంతో కొత్త ప్రయోగంను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, సీన్ రొనాల్డ్, ప్రేమ్ జీ, శామ్, సంతోష్ నారాయణ్, జిబ్రాన్ లు సంగీతం అందిస్తున్నారు. ఈ సారి ఏమవుతుందో చూడాలి ? 

More Related Stories