English   

శింబుకి పెళ్లి...క్లారిటీ ఇచ్చిన శింబు

Simbu
2019-05-27 12:09:46

తమిళ్ లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ అయిన శింబు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. ఆయనకు ప‌లువురు హీరోయిన్స్‌తో గతంలో ఎఫైర్స్ ఉన్న‌ట్టు అనేక పుకార్లు వ‌చ్చాయి.  శింబు మొదట హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడపగా నయనతార అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత శింబు హన్సికతో ఎఫైర్ నడపగా ఆ తర్వాత ఆమెను ఆయన పెళ్లి చేసుకుంటాడనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. ఆ తర్వాత హన్సికతో కూడా ప్రేమ బెడిసికొట్టింది. ఈ ప్రేమ వ్యవహారం శింబు కెరీర్‌పై పడింది. అయితే ఈ మధ్య ఆయన మళ్లీ సినిమాలతో బిజీగా అయ్యాడు. ప్రస్తుతం శింబు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈమధ్య  శింబు సోదరుడు కురళరసన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో శింబుకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. శింబు ఫ్యామిలోనే ఒక అమ్మాయిని ఫైనల్ చేశారని ఆమెతో ఆగ‌స్ట్‌లో పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం మీద శింబు స్పందించాడు, ఈ వార్తల్లో నిజం లేదని తన కెరీర్‌లో మీడియా పాత్ర చాలా కీలకమైందని కానీ కొన్నిసార్లు కొంతమంది దర్శకులను సరదాగా కలిసినా కూడా ఏదో సినిమా కోసమేనని వార్తలు రాస్తున్నారని అలాంటివి చదివి, అవి వాస్తవంలోకి రానప్పుడు అభిమానులు బాధపడటం నాకు ఇష్టం లేదని ఆయన ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

More Related Stories