English   

రాజ్ తరుణ్ కి రెమ్యునరేషన్ లేదా ?

Raj Tharun
2019-05-27 13:51:48

హీరో రాజ్ తరుణ్...ఒకప్పటి తరుణ్ లానే మనోడు కూడా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఓకే రకం  మూస కధలను ఎంచుకోవడంతో పడిన దెబ్బకి ఇంతకీ కోలుకోలేదు. దీంతో మనోడు వరస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఏ సినిమా చేసినా అది డిజాస్టర్ అవుతుంది. ఈ దెబ్బలకి ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు ముందు రావడం లేదు. కానీ దిల్ రాజు మాత్రం ఇతనికి లేటెస్ట్ గా పిలిచి మరీ ఓ మూవీ ఆఫర్ ఇచ్చాడు. ఇద్ద‌రి లోకం ఒక్క‌టే’ సినిమాని ప‌ట్టాలెక్కించాడు.  అంటే నిజానికి ఇది దిల్ రాజు కు చాలెంజ్, గల్లా జయదేవ్ కొడుడు, అదే మహేష్ బాబు మేనల్లుడును లాంచ్ చేయాలనుకున్న సినిమా ఇది, ఇది మహేష్ కి నచ్చకపోవడంతో పక్కన పడేశారు, ఏమనుకున్నాడో ఏమో కానీ దిల్ రాజు ఈ సినిమాతో ప్రయోగం చేయాలనుకుని రాజ్ తరుణ్ ని లైన్ లోకి దింపాడు. దీంతో ఈ సినిమాకి రాజ్ త‌రుణ్‌ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండానే కేవలం ఖ‌ర్చుల‌కి  మాత్రమే డ‌బ్బులు ఇస్తున్నాడ‌ట‌. నిజానికి  కొత్త హీరోలు, ద‌ర్శ‌కుల‌తో దిల్ రాజు సినిమా చేస్తే ఈ రెమ్యున‌రేష‌న్ సిస్ట‌మే ఫాలో అవుతాడు, ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడట. నిజానికి అసలు ఈ టైలో రాజ్‌త‌రుణ్‌కి సినిమా ఛాన్స్ ద‌క్క‌డ‌మే ఎక్కువ అది కూడా రాజు గారి బ్రాండ్ అందుకే దిల్ రాజు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా ఈ హీరో స‌ర్దుకుపోతున్నాడ‌ని టాక్‌. మరి ఈ సినిమా ఏమి చేస్తుందో వేచి చూడాలి ?

More Related Stories