English   

రాఘవేంద్ర రావు రాజీనామా....అవమానం అనుకున్నారా ?

Raghavendra Rao
2019-05-27 16:13:58

గత కొన్నాళ్ళగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) చైర్మన్‌ గా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. వయోభారం వల్లనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. రేపి టిటిడి బోర్డు మీటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోరు బోర్డు సభ్యులు రాజీనామాలు చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఆయన రాజీనామా ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఆయన గత కొన్నాళ్ళగా సినిమాలు చేయడమే ఆపేసారు, ఆయన చేసిన చివరి సినిమా నమో వెంకటేశా. ఆ సినిమా తర్వాత ఆయన ఎటువంటి సినిమా చేయలేదు. తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ చీఫ్ కి సన్నిహితంగా ఉండే రాఘవేంద్ర రావు గత ఎన్నికల్లో టీడీపీ గెలవగానే ఈ ఛానల్ బాద్యతలు తీసుకున్నారు. ఇక ప్రభుత్వం మారుతున్న తరుణంలో తనను వారు తొలగిస్తే అవమానం అని భావించిన ఆయన ముందే తప్పుకుంటున్నట్టు చెబుతున్నారు.

More Related Stories