English   

డాన్ గా విజయ్...హీరోయిన్ గా గీత ?

 Vijay
2019-05-27 16:36:35

త‌మిళ హీరో విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్నారు. ఆయన సరసన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ నటించనున్న 64వ చిత్రం గురించి ప‌లు ఆసక్తికర వార్త‌లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే న‌గ‌రం ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ 64వ సినిమా ఉండనుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజ‌య్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నార‌ట‌. రెండు గ్యాంగ్‌స్టర్‌ గ్రూపుల మధ్య జరిగే సంఘటనలనే లైన్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట, ఇప్పటికే తమిళంలో కార్తి సరసన ఓ సినిమాలో ఆమె చాన్స్ కొట్టేయగా ఇప్పుడు స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి.

More Related Stories