English   

షూట్ లో ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ 

RRR
2019-05-27 17:57:35

బహుబలి సిరీస్ తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇద్దరు హీరోలకి గాయాలు కావడం వలన బ్రేక్ తీసుకుంది. అయితే ఇద్దరూ కోలుకోవడంతో మళ్ళీ హైదరాబాద్ లో ఈరోజు నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ - అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అది ఇంటర్వెల్ ఎపిసోడ్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసిన హాలీవుడ్ నటి మాత్రం యూనిట్ కి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు శ్రద్దా కపూర్ ని అనుకుంటున్నారట. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories