English   

ఆటో డ్రైవర్ లందరికీ విజయ్ విందు !

auto
2019-05-27 19:54:35

ప్రముఖ తమిళ హీరో విజయ్ ప్రతీ ఏడాది కార్మిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, మే 1వ తేదీన చెన్నైలోని ఆటో డ్రైవర్లందరికీ ఆయన విందు ఏర్పాటు చేస్తుంటాడు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా ఆ రోజున ఈ కార్యక్రమాన్ని జరపలేకపోయాడు. అందువలన తాజాగా ఆటో డ్రైవర్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేశాడు. అయితే ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో ఆయన బిజీగా వున్నాడు. అందుకే విజయ్ రాలేకపోయాడు. దీంతో తన పర్సనల్ మేనేజెర్ ని పంపి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తి చేశారు విజయ్. నిర్వహించిన ఈ విందు కార్యక్రమం ట్విట్టర్‌లో నిన్నంతా ట్రెండ్‌గా నడిచింది. అయితే భోజనానికి వచ్చిన ఆటో అన్నలు అందరూ కడుపు నిండా సుష్టిగా భోం చేసి, అన్నదాతా సుఖీభవ అనుకుంటూ వెళ్లారట.

More Related Stories