English   

సాహో అంటున్న ప్రభాస్ లుక్

saaho
2019-05-27 20:25:41

బాహుబలి సిరీస్ తో అసంఖ్యాక క్రేజ్ ఏర్పడ్డాక రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న తాజా సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద జనాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సినిమా మీద క్రేజ్ దృష్ట్యా ఆ రోజంతా అదే విషయం ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా నుండి మొన్న  విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా యూనిట్ ప్రభాస్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. సాహో నుంచి మరో పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రభాస్ స్టైలిస్ లుక్ లో చెవికి బ్లూటూత్ డివైస్ పెట్టుకుని బైకు మీద రేసర్ రూపంలో దర్శనం ఇచ్చారు. ఈ కొత్త స్టిల్ చూస్తుంటే సాహోలో ఓ యాక్షన్ సీన్ కు సంబంధించినది భావించవచ్చు. ఇలాంటి పోస్టర్స్ టీజర్స్ తో ఈ సినిమా రోజురోజుకీ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది.  యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

More Related Stories