English   

సాహో టీంకి అనుకోని షాక్

saaho
2019-05-27 21:25:01

ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో. బాహుబలి సిరీస్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న సాహో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. బాహుబలి తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇక తాజాగా ఈ యూనిట్ కి షాక్ తగిలింది. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ల త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వారే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాము ఈ సినిమా నుండి బయటకు రావాలని అనుకుంటున్నామని ‘‘ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యాంకు గుడ్ లక్’’ అని వారు ట్వీట్ పెట్టారు. అయితే ఈ సడన్ ఎక్సిట్ కి కారణం ఏమిటనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

More Related Stories