English   

మల్లేశం వస్తున్నాడు....ఆరోజునే

biopic
2019-05-27 21:47:54

వెండితెరపై మరో బయో పిక్ ఆవిస్కృతం కాబోతోంది. ఇప్పటి వరకు క్రీడాకారులు, సినీ తారలు, రాజకీయ నాయకులు వంటి సెలబ్రిటీల బయోపిక్స్ చూశాం. కానీ ఇప్పుడు ఒక సాధారణ చేనేత కార్మికుడి జీవితాన్ని చూడబోతున్నాం. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని శారాజీపేటకు చెందిన చింతికింది మల్లేశం పేరు రెండేళ్ల క్రితం పెద్దగా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అతనొక సాధారణ చేనేత కార్మికుడు. కానీ, పద్మశ్రీ అవార్డు అతన్ని వరించడంతో ఆయన గురించి తెలుగు ప్రజలకు తెలిసింది. అమ్మ కష్టం చూసిన మల్లేశం ఆమె కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆలోచించి ఆలోచించి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. దానికి లక్ష్మీ ఆసుయంత్రం అని పేరు పెట్టారు. దీనికి 2011లో పేటెంట్ హక్కు కూడా లభించింది. ఈ యంత్రాన్ని కనిపెట్టినందుకుగాను తెలంగాణ రాష్ట్ర సిఫారుసు మేరకు 2017లో మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం లభించింది. ఒక సాధారణ చేనేత కార్మికుడు పద్మశ్రీ గ్రహీతగా ఎదిగిన తీరును ఇప్పుడు తెరపై ఆవిష్కరిస్తున్నారు. మల్లేశం పాత్రను ప్రముఖ కమెడియన్, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి పులికొండ పోషించారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని  జూన్ 21న రిలీజ్ చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. 

More Related Stories