English   

అనిల్-మహేశ్ సినిమా ముహూర్తం రోజే రిలీజ్ డేట్ కూడా ?

maheshbabu
2019-05-27 22:08:32

వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ హిట్స్ కొట్టి మంచి ఫాంలో ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్ సినిమా మీద చాలా ఆసక్తి నెలకొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది. టాలీవుడ్‌లో వరుసగా హిట్స్ కొట్టిన అనిల్ మహేష్‌ బాబుతో ఈ సినిమా ఎలా తీస్తారో అని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అలాగే రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తారని సమాచారం, కాగా ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇక మహర్షి సక్సెస్‌ ని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేస్తారని అంటున్నారు, దాదాపుగా ఆ సినిమా అయితే సంక్రాంతికే అంటున్నారు, డేట్ మాత్రం ఫైనల్ కావాల్సి ఉంది.

More Related Stories