English   

గొరిల్లాతో మాయ చేయనున్న షాలినీ-జీవాలు

gorilla
2019-05-27 22:20:27

రంగం మూవీతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవా చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా గొరిల్లా. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటి సారిగా నిజమైన గొరిల్లాతో షూట్ చేసిన సినిమా ఇదే. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రాధారవి, రాజేంద్రన్, సతీష్, యోగిబాబు, రామ్ దాస్, వివేక్ ప్రసన్న తదితరులు లీడ్ క్యారెక్టర్స్ చేసారు. అప్పట్లో మన తెలుగులో ఒక సినిమా వచ్చింది, సాహసబాలుడు విచిత్ర కోతి అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి కాన్సెప్ట్ కాకపోయినా దాదాపు అలాంటి దానితోనే వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అదే రోజున తెలుగులో ప్రియదర్శి నటించిన బయోపిక్ సినిమా మల్లేశం కూడా రిలేజ్ కానుంది.

More Related Stories