English   

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన మరో స్టైలిష్ విలన్

 Prateek Jain
2019-05-28 11:46:34

ఎఫ్ 2 విజయం తర్వాత విక్ట‌రీ వెంక‌టేష్‌, మజిలీ బ్లాక్ బస్టర్ తర్వాత నాగ‌ చైత‌న్య ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా వెంకీ మామ. నిజంగానే మామా అల్లుళ్ళు అయిన వీరిద్దరూ, ఆన్ స్క్రీన్ కూడా మామా అల్లుళ్ళుగా నటిస్తున్న ఈ సినిమాని జై లవ కుశ ఫేం కె.ఎస్‌.ర‌వీంద్ర‌ (బాబీ)దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, వెంకటేష్ పాత్ర మీద క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఫేమస్ మోడల్, మిస్లర్ ఇండియా-2014 ప్రతీక్ జైన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడట. వెంకీ మామ సినిమాలో ప్రతీక్ జైన్ స్టైలిష్ విలన్ గా కనిపించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జమ్మూ కశ్మీర్ లో జరుగుతుండగా ఇప్పటికే ప్రతీక్ జైన్ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడట. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద డి.సురేష్ బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ద‌స‌రా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

More Related Stories