English   

రాజశేఖర్ కూతురి సినిమా వివాదం 

2 States
2019-05-28 12:47:37

సీనియర్‌ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సినిమా ‘టూ స్టేట్స్’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఈ సినిమాని దర్శకుడు వెంకట్ రెడ్డి అడివి శేష్ హీరోగా శివాని హీరోయిన్ గా ప్లాన్ చేశారు, కొంత షూట్ కూడా అయ్యాక ఈ సినిమా ఆగిపోయింది. ఇక తాజాగా నిర్మాత ఎం.ఎల్.వి సత్య నారాయణ (సత్తిబాబు)పై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు డైరెక్టర్. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిందని కానీ ఇప్పుడు డైరెక్టర్ అయిన తనకు తెలియకుండా నిర్మాత కథలో మార్పులు చేశారని ఆరోపించారు. సినిమా నుంచి తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అయన కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు నిర్మాత సత్యనారాయణ ఈ నెల 30న హాజరై, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇంకా 30 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉండగా తనను కాదని తన స్థానంలో దర్శకత్వం చేయడానికి ఎవరు వచ్చినా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన '2 స్టేట్స్' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌ కాగా అదే టైటిల్‌ తో తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నారు.  

More Related Stories