English   

డిజాస్టర్ కాంబినేషన్ కి మరో డిజాస్టర్ తోడు 

 Vasu Varma
2019-05-28 13:16:47

సినిమా అంటేనే ప్రయోగం అంటుంటారు ఆ ఇండస్ట్రీలో కొందరు పెద్ద మనుషులు. నిజానికి అదే నిజమని చెప్పాలేమో ? ఎందుకంటే ఈ మధ్య అఖిల్ నాలుగో సినిమా ఒకటి మొదలయ్యింది. హీరోగా నిలబడేందుకు అఖిల్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కానీ టైం బాలేదో ఏమో కానీ ఆయనకు ఒక్క హిట్ కూడా పడట్లేదు. ఇక అయన ఇప్పటికే డిజాస్టర్ అమ్మ మొగుడు లాంటి సినిమాలు ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు. ఇలాంటి డిజాస్టర్ ట్రాక్ రికార్డున్న హీరో, డిజాస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ తో హిట్స్ ఉన్న గీతా ఆర్ట్స్ 2 సినిమా చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంటే ఇందులో నిర్మాణ భాగస్వామిగా మరో డిజాస్టర్ డైరెక్టర్‌ని పెట్టుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ దర్శకుడి పేరు వాసు వర్మ. అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయం అయిన 'జోష్' సినిమాతో వాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలవగా వాసు మళ్ళీ కృష్ణాష్టమ అనే మరో సినిమా తీసి మరో డిజాస్టర్ ఇచ్చాడు. ఇక ఆ కృష్ణాష్టమి తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాసు వర్మ ఇంత కాలానికి అఖిల్-భాస్కర్ సినిమాతో మీడియా కంట్లో పడ్డాడు. దర్శకుడిగా రాణించలేకపోయినా నిర్మాతగా ఆయన ఏమాత్రం రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.  

More Related Stories