English   

చరణ్ కోసం వారిద్దరూ ? నిజమేనా ?

Ram charan
2019-05-28 14:20:55

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2020 జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మధ్యలో అనుకోని అవాంతరాలు వచ్చాయి కాబట్టి ఇంకాస్త లేటు అవ్వనూ వచ్చు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనే దాని మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయం మీద చూచాయగా క్లారిటీ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవగానే చరణ్ కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చేస్తాడట.  ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.  ఇందులో కాజల్ అగార్వల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలని పేర్కొంటూ మైత్రి సంస్థ ఈ వివరాలను తన వికీ పీడియా పేజీలో పేర్కొంది. కొరటాల శివ డైరెక్షన్లో చిరు సినిమా చేయబోతున్నాడు. అది పూర్తికాగానే చరణ్ తో సినిమా పట్టాలెక్కనుందట. చరణ్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాత గా భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు తో సైరా సినిమాను నిర్మిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories