English   

మళ్ళీ కలిసి నటిస్తున్న పాత ప్రేమ పావురాలు

Hansika
2019-05-28 15:16:01

శింబు - హన్సిక కొంతకాలం క్రితం ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏముయిందో ఏమో కానీ ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య మస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలం గడిచిపోయింది. హన్సికతో బ్రేకప్ అయిన తర్వాత దూరం కావడం వలన కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శింబు, ఈ మధ్యనే చాలా కాలం తర్వాత దార్లో పడ్డాడు. అలాంటి శింబు - హన్సిక కలిసి నటించనున్నారనేది తాజా సమాచారం. హన్సిక 50వ చిత్రంగా, జమీల్ దర్శకత్వంలో 'మహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శింబు కనిపిస్తాడట. నిజానికి శింబు పేరును హన్సికనే రికమెండ్ చేసిందనీ, శింబు కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే ఓకే చెప్పాడని దర్శకుడే స్వయంగా ప్రకటించడం కోలీవుడ్ లో రచ్చ రేపుతోంది. అసలు విడిపోయింది అనుకున్న ఈ జంట కలిసి నటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో విడిపోయిన ఒక జంట మళ్ళీ కలిసి అది కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో కలిసి నటించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
 

More Related Stories