English   

విజయ్ దేవరకొండ సెన్సేషనల్ డెసిషన్

Vijay Devarakonda
2019-05-28 15:56:56

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన సినిమాలు పెద్దపెద్ద బ్యానర్స్ తో చేస్తున్న విజయ్ తన క్రేజ్ వలన ప్రొడ్యూసర్స్ లాభాలని గడిస్తున్నారని భావించిన విజయ్ తన సొంత ప్రొడక్షన్ అయినా `కింగ్ ఆఫ్ ది హిల్స్‌` అనే ఓ సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించాడు. ఇప్పుడు ఆయన ఆ సంస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డాడని అంటున్నారు. నిజానికి విజయ్ డియర్ కామ్రేడ్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఆ సినిమా అయ్యాక క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రిలీజ్ కానుంది. అది అయ్యాక ఆనంద్ అన్నామలై తీస్తున్న సినిమా చేయాలి. ఈ సినిమా  కాకుండా ఆయన మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలు అన్నీ ఆయన పెళ్లిచూపులు సమయంలో అడ్వాన్స్ తీసుకున్నవే. అయితే అడ్వాన్స్ తీసుకున్న అన్ని సినిమాలు చేసేశాక ఇక విజయ్ బయట సినిమాలు ఆపేస్తాడని అంటున్నారు. ఆయన సైన్ చేయబోయే ప్రతి సినిమా కింగ్ అఫ్ ది హిల్స్ భాగస్వామ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ కథ దర్శకుడు రెండూ నచ్చి వర్క్ అవుట్ అవుతాయనిపిస్తే ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. 

More Related Stories