English   

అల్లరి నరేష్ ఇంట విషాదం 

 Allari Naresh
2019-05-28 16:40:48

సినీ నటుడు అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దివంగత సినీ దర్శకుడు, అల్లరి నరేష్ తండ్రి అయిన ఈవీవీ సత్యనారాయణ కన్న తల్లి ఈదర వెంకటరత్నమ్మ వారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం కోరుమామిడిలో కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ మరణించినప్పటి నుంచి ఆమె కోరుమామిడిలోనే నివసిస్తోంది. అయితే వృద్ధాప్య కారణాలతో అనారోగ్యానికి గురికావడమే కాక ఈ ఎండల ధాటిని తట్టుకోలేని ఆమె నిన్న మరణించారు. తమ నానమ్మ మృతి వార్త తెలుసుకుని హుటాహుటిన గ్రామానికి వచ్చిన అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్, ఈవీవీ సోదరుడు సత్తిబాబులు తమ ఆధ్వర్యంలోనే దగ్గరుండి ఆమె అంత్యక్రియలు జరిపించారు. కాగా, ఈదర వెంకట్రావు, వెంకటరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణతో పాటు గిరి, శ్రీనివాస్ అనే కుమారులు ఉండగా వారికి మంగ అనే మరో కుమార్తె కూడా ఉన్నారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు నరేశ్, రాజేశ్ లకు సంతాపం తెలియచేశారు.

More Related Stories