English   

రాఘవేంద్రరావు సంచలన ప్రకటన...సస్పెన్స్ ?

 Raghavendra Rao
2019-05-28 19:21:56

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ గా నిన్నటి వరకూ సేవలందించి నిన్న వయోభారం పేరుతో ఆ పదవికి  రాజీనామా చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, ఈరోజు తానో కొత్త చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆయన ఫేస్ బుక్ పోస్ట్ ప్రకారం ''నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో " అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టర్ ని పరిశీలిస్తే ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని అర్ధం వచ్చేలాగా ఈ పోస్టర్ ఉంది. అయితే ఇంతకు మించి ఆయన ఇంకే హింట్ ఇవ్వక పోవడంతో ఆయన సినిమాకి దర్శకత్వం వహిస్తారా ? లేక సినిమా నిర్మాతగా మారనున్నారా అనేది తెలియాల్సి ఉంది.  

More Related Stories